Tuesday, January 21, 2025

టిడిపిలో చేరిన బాబు మోహన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాజీ మంత్రి, నటుడు బాబు మోహన్ సొంత గూటికి చేరుకున్నారు. టిడిపిలో సభ్యత్వం తీసుకున్నట్టుగా సోషల్ మీడియాలో ఫొటోను షేర్ చేశారు. తెలంగాణలో టిడిపి బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా అడ్‌హక్ కమిటీలను ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాలను చేపడుతోంది. మంగళవారం బాబు మోహన్ అందోల్ నియోజకవర్గంలో టిడిపి సభ్యత్వం తీసుకున్నాడు. బాబు మోహన్ నటుడిగా ప్రయాణి చేసిన అనంతరం టిడిపిలో చేరి రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టాడు. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్‌ఎస్ నుంచి ఎంఎల్‌ఎ టికెట్ రాకపోవడంతో బిజెపిలో చేరారు. బిజెపి నుంచి అందోల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ప్రస్తుతం ఆయన బిజెపి నుంచి టిడిపిలో చేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News