వరంగల్: సినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ వరంగల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. బాబు మోహన్ వరంగల్ రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆయన గత కొన్ని రోజుల నుంచి వెన్నునొప్పితో బాధపడుతున్నారు. దీంతో సిబ్బంది వీల్ చైర్ ఏర్పాటు చేసి కార్యాలయంలోనికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయనను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. కెఎ పాల్ ప్రజాశాంతి పార్టీ నుంచి నామినేషన్ వేస్తారని ప్రచారం జరిగిందని మీడియా వారు అడిగారు. కెఎ పాల్ రమ్మని కబురు పంపితే ఇంటికి వెళ్లానని, కాపీ తాగానని, అక్కడ పాల్ ప్రజాశాంతి పార్టీ కండువా కప్పి పార్టీ అధ్యక్షుడు చేశారని వివరణ ఇచ్చారు. తాను ఇప్పటి వరకు ఆ పార్టీ తరపున సభ్యత్వం తీసుకోలేదని చెప్పారు. అదే రోజు ప్రజాశాంతి పార్టీకి బైబై చెప్పానని వివరణ ఇచ్చారు. అభిమానుల కోరిక మేరకు మాత్రమే వరంగల్‌లో నామినేషన్ వేశానని చెప్పారు.
Wheelchair లో వచ్చి నామినేషన్ వేసిన #Babumohan
ప్రజాశాంతి పార్టీ తరఫున వరంగల్ పార్లమెంట్ స్థానానికి నామినేషన్ వేసిన బాబు మోహన్. pic.twitter.com/grnF4ZZH1J
— 🏏Pink Panther 💓🐯 (@biasedbanti) April 25, 2024