Wednesday, January 22, 2025

వైజాగ్ నుంచి నేను..వరంగల్ నుంచి బాబుమోహన్ పోటీ

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో ఎవరితో పొత్తు లేకుండా అన్ని స్థానాలలో పోటీ చేస్తామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు డాక్టర్ కె.ఎ. పాల్ వెల్లడించారు. శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మాజీ మంత్రి బాబు మోహన్‌తో కలిసి కె.ఎ. పాల్ మీడియాతో మాట్లాడుతూ..
వైజాగ్ పార్లమెంట్ స్థానం నుండి తాను పోటీ చేస్తున్నానని ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా తాము అడ్డుకుంటామని, అందుకు ఏ స్థాయికైనా వెళ్లి పోరాటం చేస్తామని అన్నారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీతో అయినా పొత్తు పొట్టుకోడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇటీవల ప్రజాశాంతి పార్టీలో చేరిన మాజీ మంత్రి బాబు మోహన్ వరంగల్ లోక్‌సభ స్థానం

నుంచి పోటీ చేయనున్నారని కె.ఎ పాల్ వెల్లడించారు. బాబు మోహన్ మాట్లాడుతూ, బిజెపి పార్టీ తనను గత ఐదు సంవత్సరాలుగా వెట్టిచాకిరి చేయించుకుని వాడుకున్నారని మండిపడ్డారు. వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తానన్న లక్ష్మణ్ లిస్టులో తన పెరులేకుండానే కేంద్రానికి పంపారని ఆరోపించారు. దేశం బాగుపడాలని నిరంతరం ప్రజాసేవలో ఉంటున్న కె.ఎ. పాల్‌తో కలసి పనిచేయాలని తాను ప్రజాశాంతి పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు. కె.ఎ.పాల్ నేతృత్వంలో పని చేసి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి పాల్ సేవలు దేశానికి,రాష్ట్రానికి అందే విధంగా కృషి చేస్తానని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News