Thursday, December 19, 2024

రాజీనామా చేస్తా… బిజెపికి బాబు మోహన్ షాక్…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయించుకున్నానని ప్రముఖ సినీ నటుడు, మాజీ ఎంఎల్ఏ బాబు మోహన్ అన్నారు. ఎన్నికలు, పార్టీకి, పార్టీ ప్రచారాలకు దూరంగా ఉంటానని బాబు మోహన్ తెలిపారు. అధిష్ఠానం నిర్ణయం మేరకు పార్టీకి కూడా రాజీనామా చేస్తానని తేల్చిచెప్పారు. నా కుమారుడికి టికెట్ ఇస్తున్నట్లు ప్రచారం చేశారు. నా కుమారుడిని నా నుంచి విడదీసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

అర్హులకే టికెట్ ఇవ్వాలని బిజెపి పెద్దలను కోరుతున్నానని చెప్పారు. పార్టీలో తనకు చాలా అవమానాలు జరిగాయన్నారు. ఆత్మాభిమానం దెబ్బతినడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. నాకు, నా కుమారుడికి మధ్య పోటీ సృష్టించారన్నారు. బిజెపి జాబితాలో నా పేరు లేకపోవడంతో తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ నా ఫోన్ ఎత్తరు అని బాబూ మోహన్ ఆరోపించారు. తనను కావాలనే పార్టీకి దూరంగా పెట్టారనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News