Sunday, December 22, 2024

కెఏ పాల్ గెలిస్తే రాష్ట్రానికి మంచిదంటున్న ప్రముఖ నటుడు!

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్ సభకు పోటీ చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సన్నాహాలు చేసుకుంటున్నారు. విశాఖపట్నం నుంచి పోటీ చేయనున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఆ పార్టీలో చేరిన బాబు మోహన్ మాత్రం తాను ఈసారి ఎన్నికల్లో పోటీ చేయట్లేదన్నారు. గాజువాక నుంచి పోటీ చేయవలసిందిగా పాల్ తనను కోరారని, కానీ తనకు ఆసక్తి లేదని ఆయన చెప్పారు.

అయితే తాను పాల్ కోసం ప్రచారం చేస్తానన్నారు. పాల్ ఎంపీగా గెలిస్తే రాష్ట్రానికి, దేశానికి మంచి జరుగుతుందన్నారు బాబూ మోహన్. పాల్ గెలిస్తే ఇతర దేశాల నుంచి విరాళాలు తెచ్చి, మన రాష్ట్రం, దేశం చేసిన అప్పులను తీరుస్తారని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News