Monday, March 31, 2025

కంటతడి పెట్టుకున్న బాబూ మోహన్

- Advertisement -
- Advertisement -

తననూ, తన కొడుకునూ బీఆర్ఎస్ విడదీసిందని బాబూ మోహన్ కంటతడి పెట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ లో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ కుట్రలతో గెలవాలని చూస్తే గెలవలేరని అన్నారు. తన కుమారుడి పేరు ఉదయ్ భాస్కర్ అయితే ఉదయ్ బాబూ మోహన్ అని ప్రచారం చేస్తున్నారనీ, ఇలా తన పేరుతో లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు.

తన పేరును రాజకీయంగా వాడుకోవాలని చూస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. ఎన్నికల్లో నిలబడతానని తన కొడుకు తనతో చెప్పి ఉంటే, తాను టికెట్ ను త్యాగం చేసేవాడినని బాబూ మోహన్ చెప్పారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన ఆందోల్ నియోజకవర్గంనుంచి బీజేపీ టికెట్ పై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News