Friday, November 22, 2024

బెంగాల్ అసెంబ్లీ బరిలో బాబుల్ సుప్రియో

- Advertisement -
- Advertisement -

Babul Supriyo contest from Bengal Assembly seat

టోలీగంజ్‌నుంచి బరిలోకి దిగనున్న కేంద్ర మంత్రి
65 మంది అభ్యర్థులతో బిజెపి రెండో జాబితా

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో అధికార పీఠాన్ని దక్కించుకోవాలన్న పట్టుటదలతో ఉన్న భారతీయ జనతా పార్టీ ఒక కేంద్ర మంత్రి సహా ముగ్గురు లోక్‌సభ ఎంపిలను, ఒక రాజ్యసభ సభ్యుడిని అసెంబ్లీ ఎన్నికల బరిలో దింపింది. బిజెపి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం 65 మంది అభ్యర్థులతో రెండో జాబితాను ఆదివారం విడుదల చేసింది. ఈ జాబితాలో కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో, రాజ్యసభ సభ్యుడు స్వపన్‌దాస్ గుప్తాల పేర్లు ఉన్నాయి. బాబుల్ సుప్రియో కోల్‌కతాలోని టోలీగంజ్‌నుంచి పోటీ చేస్తారు. అక్కడ ఆయన మూడు సార్లు టిఎంసి ఎంఎల్‌ఎ అయిన అరూప్ బిశ్వాస్‌ను ఢీకొంటారు.

అలాగే రాజ్యసభ నామినేటెడ్ ఎంపి అయిన స్వపన్ దాస్ గుప్తా హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్‌నుంచి బిజెపి టికెట్‌పై పోటీ చేస్తారు. తారకేశ్వర్‌లో ఆయన టిఎంసి అభ్యర్థి రామేందు సింగ్‌ను ఢీకొంటారు. మరో ఎంపి , సినీ నటి లాకెట్ చటర్జీ హుగ్లీ జిల్లాలోని చిన్‌సురానుంచి పోటీ చేయనుండగా, మరో ఎంపి నితీశ్ ప్రామాణిక్ కూచ్ బిహార్ జిల్లాలోని దిన్‌హతానుంచి పోటీ చేయనున్నారు. పశ్చిమ బెంగాల్‌లో మూడో విడత ఎన్నికల కోసం 27 మంది అభ్యర్థులను, నాలుగో విడత కోసం 38 మంది అభ్యర్థులను బిజెపి ఆదివారం ప్రకటించింది. ఈ జాబితాలో నలుగురు సినీతారలు కూడా ఉన్నారు. కాగా నలుగురు ఎంపిలను అసెంబ్లీ బరిలోకి దించడం బిజెపికి అసెంబ్లీకి తగిన అభ్యర్థులు దొరక లేదనడానికి నిదర్శనమని తృణమూల్ కాంగ్రెస్ నేత, రాష్ట్ర మంత్రి పార్థ చటర్జీ వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News