ఛండీగఢ్: బర్త్‌డే రోజు కేక్ తిని పడుకున్న కాసేపటికి చిన్నారి మృతి చెందిన సంఘటన పంజాబ్‌లోని పటియాలా ప్రాంతంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మార్చి 24న పదేళ్ల పాపకు పుట్టిన రోజు ఉండడంతో ఆమె తల్లిదండ్రులు ఆన్‌లైన్‌లో కేక్ బుక్ చేశారు. ఆదివారం సాయంత్రం 7 గంటలకు కేక్ కట్ చేసిన తరువాత అందరు అరగించారు. రాత్రి పది గంటల సమయంలో అందరూ అస్వస్థతకు గురయ్యారు. గొంతు తడారిపోతోందంటూ మాన్వి మంచి నీళ్లు తాగి నిద్రపోయింది. సోమవారం తెల్లవారుజామున ఆమె ఆరోగ్యం విషమించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి చనిపోయింది. కేక్ విషపూరితం కావడంతోనే తన కూతురు చనిపోయిందని స్థానిక పోలీస్ స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి కేక్ నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారు. కేక్ విషపూరితం అని పరీక్షల్లో తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
బర్త్‌డే… పాప ప్రాణం తీసిన కేక్
- Advertisement -
- Advertisement -
- Advertisement -