Wednesday, January 22, 2025

‘బేబీ’ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్

- Advertisement -
- Advertisement -

లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ బేబీ సినిమా కల్ట్ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటనకు, నిర్మాతగా ఎస్‌కేఎన్ అభిరుచికి, సాయి రాజేష్ దర్శకత్వంపై ముఖ్య అతిథులు విజయ్ దేవరకొండ, అల్లు అరవింద్, నాగబాబు, వై.రవిశంకర్ ప్రశంసలు కురిపించారు. ఈ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ “దర్శకుడు సాయి రాజేశ్ నిజాయితీగా ఒక మంచి సినిమా చేశాడు. సినిమాతో ఆనంద్ సక్సెస్ చూస్తే గర్వంగా ఉంది. అలాగే విరాజ్, వైష్ణవికి మంచి పేరొచ్చింది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బన్నీ వాస్, మారుతి, ఎస్కేఎన్, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య, సాయి రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News