Thursday, December 19, 2024

ఎలుక కొరకడంతో శిశువు మృతి

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ ః నాగర్‌కర్నూల్ మున్సిపల్ పరిధిలోని నాగనూల్ గ్రామంలో 40 రోజుల పసి బాలుడి ముక్కును ఎలుక కొరికింది. దీంతో తీవ్ర రక్తస్రావమై మృతి చెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగనూలు గ్రామానికి చెందిన హుస్సేన్ కూతురు లక్ష్మీకళ మొదటి సంతానంగా పుట్టిన బాలుడు కిలో బరువు ఉండటంతో మెరుగైన చికిత్స కోసం మహబూబ్‌నరగ్‌లోనే ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కూడా చేయాంచారు. చికిత్స అనంతరం తల్లి ఊరైన నాగనులలో లక్ష్మీకళ కుమారుడితో విశ్రాంతి తీసుకుంటోంది.

కాగా, బాలుడు నిద్రపోతున్న సమయంలో తల్లి ఇంట్లోని పనులు చేసుకుంటుండగా బాలుడి ఏడుపు వినబడడంతో దగ్గరికి వెళ్లి చూసేసరికి ముక్కుకు గాయమై రక్తస్రావం జరుగుతుండడాన్ని గమనించింది. వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు, కానీ అక్కడ సిబ్బంది తమ వద్ద సరైన పరికరాలు లేవని, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లవలసిందిగా సూచించారు. హుటాహుటిన బాలుడిని తీసుకొని ఆంబులెన్స్‌లో నిలోఫర్ ఆసుపత్రికి వెళ్లారు. నిలోఫర్‌లో చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News