లక్నో: నిండు గర్భిణీ రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఘటనా స్థలంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చి అనంతరం ఆమె చనిపోయిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఫిరోజాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆగ్రాలో రాము-కామినీ అనే దంపతులు నివసిస్తున్నారు. కామినీ ఎనిమిది నెలల నిండు గర్భిణీగా ఉంది. రాము తన భార్యను బైక్‌పై తన సొంతూరుకు తీసుకెళ్తుండగా బరతరా గ్రామ శివారులో వారి వాహనాన్ని కారు ఢీకొట్టడంతో కామిని కిందపడింది. ఎదురుగా వస్తున్న ట్రక్కు ఆమె పైనుంచి పోనివ్వడంతో ఆమె రోడ్డుపైనే బిడ్డకు జన్మనిచ్చి అక్కడికక్కడే దుర్మరణం చెందింది. బిడ్డ ముఖం చూడకుండానే భార్య మరణించడంతో భర్త కన్నీరుమున్నీరుగా విలపించాడు. దీంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని రోడ్డును దిగ్భందించారు. ట్రక్కు డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పండంటి బిడ్డకు జన్మనిచ్చి….. రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -