అప్పుడే పుట్టి చనిపోయిన ఆడ శిశువు మృతదేహం లభ్యం
మనతెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి: పసికందు మృతదేహం లభ్యమైన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని భువనగిరి మున్సిపల్ పట్టణపరిధిలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… శనివారం భువనగిరి మున్సిపాల్ పట్టణ కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ భవన్ లో బిఎస్పి సమావేశానికి ముగిసిన తరువాత బాగారం లావణ్య అనే మహిళ తిరిగి బయటకు వెళ్లింది. పక్కన వీధి కుక్కలు పసికందును తింటుండగా గమనించారు. కుక్కలను వెళ్లగొట్టి చూడగా అప్పటికే ఆడ శిశువు మృతి చెందినట్లు గుర్తించారు. ఆ మహిళ వెంటనే భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి పట్టణ ఇన్స్పెక్టర్ సుధీర్ కృష్ణ చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఏరియా ఆస్పత్రికి తరలించారు. చుట్టు పక్కల ప్రాంతాలలో ఉన్న ప్రజల నుంచి సమాచారాని సేకరిస్తున్నారు. స్థానిక సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తామని ఎస్ఐ వెల్లడించారు. శిశువు మృతదేహం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు… ఇక్కడ ఎలా పడేశారు? అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
Also Read: పాముతో ప్రేమలో పడిన ఆవు (వీడియో వైరల్)