Friday, December 20, 2024

గప్‌చుప్ బండిపైకి దూసుకెళ్లిన కారు… చిన్నారి మృతి

- Advertisement -
- Advertisement -

లక్నో: మద్యం మత్తులో కారు నడుపుతూ పానీపూరి తింటున్న చిన్నారులపైకి దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నోయిడా సెక్టార్ 45లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. రియా(06), అను(15), అంకిత (18) అనే ముగ్గురు అక్కచెల్లెలు పానీపూరీ తినేందుకు ఇంటి నుంచి రోడ్డుపైకి వెళ్లారు. గప్‌చుప్ బండి వద్ద పానీపూరీ తింటుండగా వారిపైకి కారు దూసుకొచ్చింది. ముగ్గురు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. రియా చికిత్స పొందుతూ చనిపోయింది. అనుకు వెన్నుముకకు గాయాలు కాగా, అంకిత చిన్నగాయమైనట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కారు డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవ్ చేయడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు కారులో నలుగురు ఉన్నట్టు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని కారు సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు అతివేగంగా దూసుకరావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. పోలీసులు కఠినంగా శిక్షిస్తున్న, మద్యం తాగి డ్రైవింగ్ చేయడమనేది పెద్ద నేరమని తెలిసిన కూడా అలానే చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News