Sunday, December 22, 2024

పసికందు మృతితో డాక్టర్ల నిర్లక్ష్యం ఏమి లేదు: సూపరింటెండెంట్ రాజ్య లక్ష్మి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పసికందు మృతి విషయంలో డాక్టర్ల నిర్లక్ష్యం ఏమి లేదని కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్యలక్ష్మి తెలిపారు. శనివారం రోజు కవిత గర్భిణీ పండంటి బాబుకు జన్మనిచ్చిందని, మూడు రోజుల పాటు ఆరోగ్యంగానే ఉన్నాడని, సోమవారం రాత్రి బాబు అమ్మమ్మ తల్లి పక్కన ఉండాల్సిన బాబును తనతో పాటు కింద పడుకోబెట్టుకోవడంతో ఒక్కసారిగా ఉష్ణోగ్రత తగ్గిపోయిందని, డాక్టర్లు అందుబాటులో ఉన్న కూడా సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. మంగళవారం ఉదయం బాబు చనిపోయాడని, కుటుంబ సభ్యులు తప్పును వైద్యులపై నెట్టుతున్నారని ఆమె స్పష్టం చేశారు. బాబు బంధువులు ఆస్పత్రిపై దాడి చేసి, ఫర్నీచర్న్ ను ధ్వంసం చేశారని, తోటి రోగులను భయబ్రాంతులకు గురిచేశారని స్థానిక పోలీస్ స్టేషన్ లో రాజ్యలక్ష్మి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్ కోఠి మెటర్నిటీ ఆసుపత్రి లో మూడురోజుల పసికందు మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే మృతి చెందిదంటూ బంధువుల ఆరోపణలు చేస్తున్నారు. ఆసుపత్రి ముందు బంధువులు ఆందోళన చేస్తున్నారు. గోల్నాకకు చెందిన కవిత, సాయి కిరణ్ దంపతులకు మూడు రోజుల క్రితం బాబు జన్మించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News