Monday, January 20, 2025

ఆలౌట్ లిక్విడ్ తాగి పసిపాప మృతి

- Advertisement -
- Advertisement -

అంబర్‌పేట: దోమలకు నివారణకు వినియోగించే ఆలౌట్ లిక్విడ్ తాగి ఏడాదిన్నర పసిపాప మృతి చెందిన సంఘటన గురు వారం అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ అశోక్ తెలిపిన వివరాలు ప్రకారం.. దిల్ సుఖ్‌నగర్ చెందిన శ్రీకాంత్ శ్రావణి భార్యాభర్తలు కాగా వీరికి 15 నెలల వయసు గల శరణ్య అనే పాప ఉంది. ఈనెల 10వ శ్రావణి అంబర్‌పేట జిహెచ్‌ఎంసి కాలనీకి తన పాపతో శరణ్యతో కలిసి తల్లి ఇంటికి వచ్చింది. 12న శ్రావణి ఇంటి పనులు నిమగ్నమైన తరుణంలో పాప శరణ్య మంచంపై ఆడుకుంటూ దోమల నివారణకు వాడే ఆలౌడ్ లిక్విడ్ తాగి కొద్దిసేపు తర్వాత

పాప ఏడుస్తూ ఉండడంతో శ్రావణి చూడగా పాప నోట్లో నుంచి లిక్విడ్ వాసన వచ్చింది. వెంటనే రామంతపూర్ లోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పాప ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని నీలోఫర్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం పాప మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. చిన్నారి మరణంతో తల్లిదండ్రులను శోకసంద్రం మునిగిపోయారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News