Thursday, December 19, 2024

ప్రసూతి వైద్యం వికటించి పాప మృతి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట:హెడ్ నర్సులే డాక్టర్లుగా అవతారం ఎత్తి ఓ మహిళకు నార్మల్ డెలివరీ చేయడంతో వైద్యం వికటించి పాప మృతి చెందిన సంఘటన సూర్యపేట జిల్లా తుంగతుర్తిమండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం… మండల కేంద్రానికి చెందిన తాటిపాముల ఉపేంద్రచారి భార్య తాటిపాముల శ్రీలత ఉదయం పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రిలో చేరింది.

ప్రసూతి చేయడానికి దానికి సంబంధించిన గైనకాలజిస్ట్ లేడి డాక్టర్ లేకపోవడంతో హెడ్ నర్సులే నార్మల్ డెలివరీ చేస్తుండగా పాప పరిస్థితి విషమించింది. ఆమెను వెంటనే సూర్యాపేటకు తరలించి మెరుగైన వైద్యం అందించాలని నర్సులు తెల పడంతో సూర్యాపేటలోని పిల్లల ఆసుపత్రికి తరలించారు. దీంతో ఇక్కడ వైద్యులు పరిశీలించి పాప ఎప్పుడో చనిపోయిందని తెలిపారు. బాధితులు వెంటనే ఆసుపత్రికి చేరుకుని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

విషయం తెలుసుకున్న పోలీసులు చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కనీసం గైనకాలజిస్ట్ అందుబాటులో లేకుండా, డెలివరీ చేయడం దురదృష్టకరమని, కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News