Monday, December 23, 2024

శిశువుకు స్నానం చేయిస్తుండగా బకెట్‌లో పడిపోయింది…. మూతపెట్టి వెళ్లిపోయిన సోదరీలు

- Advertisement -
- Advertisement -

 

భోపాల్: రెండు నెలల పసికందుకు తన ఇద్దరు సోదరీలు బకెట్ దగ్గర స్నానం చేయిస్తుండగా శిశువు బకెట్‌లో పడిపోవడంతో బకెట్‌కు మూతపెట్టడంతో చనిపోయిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం నర్మదాపురం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శోభాపూర్ గ్రామంలో ఓ దంపతులకు ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లల వయసు నాలుగు సంవత్సరాలు, ఆరు సంవత్సరాలుగా ఉంటుంది. రెండు నెలల పసికందుతో కలిసి ఇద్దరు అక్కలు ఆడుకుంటున్నారు. వాళ్ల ఇంట్లో టెడీ బియర్ ఉండడంతో దానికి స్నానం చేయించి బయటక ఆరబెట్టారు. వాళ్లు అమ్మ వంటింట్లో పనులు చేసుకుంటుండగా శిశువు అనార్జ స్నానం చేయించాలని సోదరీలు నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా పసికందుకు స్నానం చేయిస్తున్నప్పుడు బకెట్‌లో పడిపోయింది.

చెల్లి బకెట్‌లో పడిపోయిందన్న ఆందోళనలో బకెట్‌కు మూతపెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వంటింట్లో నుంచి ఇంట్లోకి వచ్చేసరికి పసికందు కనిపించకపోవడంతో తన భర్తకు పోన్ చేసింది. ఎక్కడ కనిపించపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఇంట్లో సెర్చ్ చేయగా బాత్రూమ్‌లోని బకెట్లో శిశువు మృతదేహం కనిపించింది. రెండు నెలల శిశువు బకెట్ వద్దకు ఎలా వచ్చిందని తల్లిని పోలీసులు ప్రశ్నించారు. తన పిల్లలకు టెడీ బియర్ ఆడకుంటానంటే ఇచ్చానని, వాళ్లు ఆ బొమ్మకు స్నానం చేయిస్తుండగా చూశానని తల్లి చెప్పింది. ఆరు సంవత్సరాల బాలికను ప్రశ్నించాగా జరిగిన విషయం చెప్పింది. పోలీసులు చేసేదేమీ తెలియక అక్కడ నుంచి వెళ్లిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News