Wednesday, January 22, 2025

నాలుగు కాళ్లతో జన్మించిన శిశువు

- Advertisement -
- Advertisement -

గ్వాలియర్ : మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఒక మహిళ నాలుగు కాళ్ల ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువును చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. గ్వాలియర్‌లోని కందార్ కాంపూ ప్రాంతానికి చెందిన ఆరతి కుష్వాహా బుధవారం ఇక్కడి కమలా రాజా ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ఆడ శిశువును ప్రసవించింది. 2.3 కిలోల బరువున్న ఆ శిశు ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. నాలుగు కాళ్లతో జన్మించిన ఆ శిశును పరీక్షించేందుకు జయారోగ్య ఆసుపత్రి గ్రూపు సూపరింటెండెంట్‌తోసహా డాక్టర్ల బృందం ఆసుపత్రికి తరలివచ్చింది. తల్లి గర్భంలో శిశుకు పెరిగే క్రమంలో కొన్ని అవయవాలు అదనంగా ఏర్పడ్డాయని, దీన్ని వైద్య పరిభాషలో ఇషియోపగస్ అంటారని జయారోగ్య ఆసుపత్రి గ్రూపు సూపరింటెడెంట్ డాక్టర్ ఆర్‌కెఎస్ ధకడ్ తెలిపారు.

తల్లి గర్భంలో పిండం రెండు విడిపోతే శరీరం రెండు చోట్ల ఏర్పడుతుందని, నడుము కింది భాగంలో రెండు కాళ్లు అదనంగా ఆ శిశువుకు ఏర్పడ్డాయని డాక్టర్ తెలిపారు. అయితే ఆ రెండు కాళ్లు పనిచేయడం లేదని ఆమె తెలిపారు. ఆ శిశువు శరీరంలో ఇంకా ఏవైనా లోపాలు ఉన్నదీ లేనిదీ వైద్య బృందం పరీక్షిస్తోందని, ఆ ఇతర భాగాలన్నీ సక్రమంగా ఉన్న పక్షంలో సర్జరీ చేసి అదనంగా ఉన్న రెండు కాళ్లను తొలగించడం జరుగుతుందని ఆమె వివరించారు. ప్రస్తుతం ఆ పాప ఆరోగ్యంగా ఉందని ఆమె చెప్పారు. కాగా.. ఈ ఏడాది మార్చిలో మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో రెండు తలలు, మూడు చేతులు, రెండు కాళ్లు ఉన్న శిశువుకు ఒక మహిళ జన్మనిచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News