Wednesday, January 22, 2025

చిన్నారిని చిదిమేసిన కారు

- Advertisement -
- Advertisement -

baby girl dies in car accident

మనతెలంగాణ, హైదరాబాద్ :  పద్నాలుగు నెలల చిన్నారిపై కారు ఎక్కించడంతో అక్కడికక్కడే మృతిచెందిన దారుణమైన సంఘటన సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం మద్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…సనత్‌నగర్, జింకలవాడ బస్తీ ఆంజనేయ ఆలయం సమీపానికి చెందిన పొట్టేలు అఖిల్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. అఖిల్ భార్య, కూతురు మొక్షిక(14నెలలు)తో ఉంటున్నాడు. అయితే ఆదివారం మధ్యాహ్నం మొక్షిక ఇంటి ఎదుట ఆడుకుంటోంది. ఈ క్రమంలోనే ఐ 10(ఎపి 13 పి 5726) కారు అదుపు తప్పి వేగంగా వచ్చి బాలికపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందింది. సంఘటన జరిగిన వెంటనే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అతివేగమే కారు ప్రమాదంలో బాలిక మృతిచెందిందని స్థానికులు తెలిపారు.

విషయం తెలియగానే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం బాలిక మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. స్థానికంగా ఉన్న సిసిటివిల ఫుటేజ్‌ను పరిశీలించి ఐ10 కారును గుర్తించారు. దాని ఆధారంగా కారును నడిపిన నిందితుడు మహ్మద్ రసూల్‌ను అరెస్టు చేశారు. కారు డ్రైవింగ్ చేసిన రసూల్‌కు డ్రైవింగ్ లైసెన్స్, కారుకు ఇన్సూరెన్స్ లేనట్లు తెలిసింది. నిందితుడు మద్యం తాగి కారు నడిపాడా, అతివేగంగా నడపాడా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News