Tuesday, November 5, 2024

విస్తారా విమానంలో ఓ పాపకు తిరిగి శ్వాస

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : విస్తారా విమానంలో ఓ రెండేళ్ల పాప పునర్జన్మ పొందింది. విమానం ప్రయాణిస్తున్నప్పుడు రెండేళ్ల పసికందు ఉన్నట్లుండి శ్వాస నిలిచిపోయి , బిక్కచిక్కింది. ఈ విమానంలోనే స్థానిక ఎయిమ్స్‌కు చెందిన ఐదుగురు డాక్టర్లు కూడా ఉన్నారు. ఈ బాలిక పరిస్థితి చూసి వీరు వెంటనే స్పందించారు. వీరు సకాలంలో వైద్య పరీక్షలు చేసి, పాప తిరిగి ఊపిరి తీసుకునేలా చేయడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. బెంగళూరు నుంచి ఢిల్లీకి ఈ విమానం బయలుదేరిన కొద్ది సేపటికే ఏ కారణం చేతనో పాప శ్వాస సమస్యతో బాధపడింది.

విస్తారా విమానం యుకె 814లో ఈ ఘటన జరిగింది. ఈ రెండేళ్ల పాపకు సైనోటిక్ సమస్య తలెత్తినట్లు తెలిసింది. ఈ పాప ఫోటోను డాక్టర్లు ఆ తరువాత ట్విట్టర్‌లో పొందుపర్చారు. ముందుగా పాపకు ఉపశమనం కల్గించిన తరువాత విమానాన్ని నాగ్‌పూర్‌కు మళ్లించారు. అక్కడ డాక్టర్లు పాపకు సర్జరీ జరిపారు. ప్రస్తుతం ఈ చిన్నారి పరిస్థితి కుదురుగా ఉందని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News