Thursday, December 26, 2024

నీలోఫర్ ఆస్పత్రిలో పసికందు కిడ్నాప్

- Advertisement -
- Advertisement -

నెలల వయస్సు ఉన్న పసికందు కిడ్నాప్‌కు గురైన సంఘటన నీలోఫర్ ఆస్పత్రిలో శనివారం చోటుచేసుకుంది. గుర్తుతెలియని మహిళ పసికందును చికిత్స కోసం తీసుకుని వెళ్తున్నట్లు చెప్పి కిడ్నాప్ చేసింది. జహీరాబాద్‌కు చెందిన హసీనాబేగం, గఫర్ దంపతులకు బాబు జన్మించాడు. పసికందుకు జాండీస్ రావడంతో చికిత్స కోసం నీలోఫర్ ఆస్పత్రికి తీసుకుని వచ్చారు. ఈక్రమంలోనే డాక్టర్‌కు చూపించేందుకు వేచి చూస్తుండగా ఓ మహిళ వచ్చి బాబును చికిత్స కోసం తీసుకుని వెళ్తున్నానని బాబు తల్లికి చెప్పిందా.

తాను ఆస్పత్రి సిబ్బంది అని చెప్పడంతో మహిళ బాబును డాక్టర్ వద్దకు తీసుకుని వెళ్తుందని భావించి ఇచ్చింది. ఇలా బాబును తీసుకుని వెళ్లిన మహిళ చాలా సేపైనా తిరిగి రాకపోవడంతో భార్యభర్త కలిసి ఆస్పత్రి మొత్తం వెతికారు. అయినా బాబు ఆచూకీ లభించలేదు, వెంటనే నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రి పరిసరాల్లో ఉన్న సిసిటివిల ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆస్పత్రిలో భద్రతా వైఫల్యం కారణంగానే కిడ్నాప్ చేశారని బాలుడి తల్లి ఆరోపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News