Monday, December 23, 2024

‘బేబీ’ వచ్చేస్తోంది

- Advertisement -
- Advertisement -

ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్యలు కలిసి నటించిన మూవీ బేబీ. ‘కలర్ ఫోటో’ లాంటి నేషనల్ అవార్డ్ సినిమాను ప్రొడ్యూస్ చేసిన సాయి రాజేష్ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నారు. ఇక ఈ ఫీల్‌గుడ్ లవ్ స్టోరీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ఇప్పటికే సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ‘బేబీ’ జూలై 14న విడుదల కానుంది. ఇదే విషయాన్ని హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐ-మాక్స్ దగ్గ ర దాదాపు 70 అడుగుల విడుదల తేదీ పోస్టర్ తో ప్రకటించారు. ఈ విడుదల తేదీ పోస్టర్ లాం చ్‌కి ఆనంద్ దేవరకొండ,విరాజ్ అశ్విన్ ,వైష్ణవి చైతన్యలతో పాటు ఈ చిత్ర దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత ఎస్‌కేఎన్, కో ప్రొడ్యూసర్ ధీరజ్ హాజరయ్యారు. ఒక ఇంటెన్స్ లవ్ స్టొరీతో అందరికీ నచ్చే అంశాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తెలిపింది టీమ్.

Also Read: బిజెపిలో అడుగడుగునా అన్యాయం: రఘనందన్‌రావు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News