Wednesday, January 22, 2025

బాక్సాఫీసు వద్ద ‘బేబి’ కలెక్షన్ల సునామీ..

- Advertisement -
- Advertisement -

ఆనంద్ దేవరకొండ, విరాజ్, వైష్ణవి చైతన్యలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన యూత్ ఫుల్ లవ్ స్టోరీ ‘బేబి’ బాక్సాఫీసు వద్ద  కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ సంచలన విజయాన్ని అందుకుంది. విడుదలైన మొదటి రోజు నుంచి ఊహించని కలెక్షన్లతో షాకిచ్చింది. అద్భుతమైన పాటలు, యూత్ ను ఆకట్టుకునే లవ్ సీన్స్, ఎమోషన్స్ తోపాటు హీరోహీరోయిన్ల పర్ఫామెన్స్ కు అందరూ ఫిదా అయిపోయారు. దీంతో విడుదలైన వారం రోజుల తర్వాత కూడా ‘బేబి’ రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. దీంతో కేవలం 8 రోజుల్లోనే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.54 కోట్ల గ్రాస్ ను వసూల్ చేసి సత్తా చాటుతోంది.

సినీ క్రిటిక్స్, సెలబ్రెటీలు ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు. ఇక, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘బేబి’ సక్సెస్ పై ఆనందం వ్యక్తం చేస్తూ చిత్రయూనిట్ ను ప్రశంసించిన విషయం తెలిసిందే. రెండో వారంలో కూడా ఈ సినిమా చాలా ప్రాంతాల్లో హౌస్ ఫుల్ షోలతో సక్సెల్ పుల్ గా రన్ అవుతోంది. మరి, ఈ ‘బేబి’ ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి. కాగా, ఈ మూవీకి సాయి రాజేశ్ దర్శకత్వం వహించగా, ఎస్ కెఎన్ నిర్మించారు. విజయ్ బుల్గాని అద్భుతమైన సంగీతం అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News