Wednesday, January 22, 2025

బ్లాక్‌బస్టర్ కాంబోలో సినిమా..

- Advertisement -
- Advertisement -

ఈ ఏడాది టాలీవుడ్ కల్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది ‘బేబి’ సినిమా. ఈ బ్లాక్‌బస్టర్ కాంబో మళ్లీ రిపీట్ అవుతోంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా 100 కోట్ల గ్రాసింగ్ ప్రొడక్షన్ హౌస్ మాస్ మూవీ మేకర్స్, ‘కలర్ ఫొటో’తో నేషనల్ అవార్డ్ గెల్చుకున్న బ్యానర్ అమృతా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ‘బేబి’ దర్శకుడు సాయి రాజేశ్ ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు.

Also Read:ఆ ఆలోచన లేదంటున్న మిల్కీ బ్యూటీ..

ఈ సినిమాకు ఎస్‌కేఎన్‌తో కలిసి సాయి రాజేష్ ప్రొడ్యూసర్‌గానూ వ్యవహరిస్తున్నారు.నూతన దర్శకుడు రవి నంబూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. వచ్చే సమ్మర్‌లో థియేటర్స్ ద్వారా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News