- Advertisement -
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న చిత్రం బేబీ. హృదయకాలేయం ఫేం డైరెక్టర్ సాయిరాజేశ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సోమవారం ఈ సినిమా టీజర్ ను మూవీ మేకర్స్ లాంచ్ చేశారు. స్కూల్ నేపథ్యంలో సాగే ప్రేమ కథా చిత్రంగా రూపొందిస్తున్న ఈ చిత్ర టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇక, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కేఎన్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి విజయ్ బల్గానిన్ సంగీతం అందిస్తున్నాడు. త్వరగా
షూటింగ్ పూర్తి చేసి విడుదల తేదీని ప్రకటించనున్నట్లు మేకర్స్ వల్లడించారు.
‘Baby’ Movie Teaser Released
- Advertisement -