Sunday, December 22, 2024

చంటి బిడ్డ ఏడుపు.. తల్లి ప్రాణాలు కాపాడింది..

- Advertisement -
- Advertisement -

కోసిగి: చంటి బిడ్డ ఏడుపు ఓ మహిళ జీవితాన్ని కాపాడింది. కర్నూలు జిల్లా కోసిగి రైల్వేస్టేషన్ లో మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చంటిబిడ్డను ప్లాట్ ఫాంపై ఉంచి మహిళ రైలు కిందపడబోయింది. చంటి బిడ్డ ఏడుపు విన్న స్థానికులు మహిళను కాపాడారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు భర్తను పిలిచిన కోసిగి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. కుటుంబంలో గొడవల వల్లే మహిళ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. దురదృష్టవశాత్తు ఆమె చనిపోయి ఉంటే పసిబిడ్డ అనాథ అయ్యేదని స్థానికులు అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News