Sunday, December 22, 2024

వాల్తేరు వీరయ్యలో సోలమన్ సీజర్‌గా..

- Advertisement -
- Advertisement -

 

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ’వాల్తేరు వీరయ్య’. ఈ సినిమా నుండి సోలమన్ సీజర్‌గా బాబీ సింహా ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి మెగా మాస్, కమర్షియల్ ఎం టర్‌టైనర్ ‘వాల్తేర్ వీరయ్య’ను బాబీ కొల్లి(కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్రలో మాస్ మహారాజా రవితేజ కనిపించబోతున్నారు. ఇద్దరు స్టార్లను కలిసి తెరపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ‘వాల్తేరు వీరయ్య’లో నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ బాబీ సింహా ఓ కీలక పాత్ర పోస్తున్నారు. బాబీ సింహా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ “సోలమన్ సీజర్‌”గా చిత్రంలోని ఆయన ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో బాబీ లుక్ చాలా ఆసక్తికరగా ఉంది. టక్ చేసుకున్న పూల చొక్కా, మెడలో బంగారు గొలుసులు, చేతికి బంగారు కడియం, గడియారం, నల్లటి కళ్ళజోడుతో బ్రైట్ వింటేజ్ లుక్‌లో ఆయన కనిపించారు. బాబీ ఫస్ట్ లుక్ చూస్తుంటే వాల్తేరు వీరయ్యలో “సోలమన్ సీజర్‌” పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని అర్ధమౌతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Baby Sinha First look out from ‘Waltair Veerayya’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News