Sunday, January 19, 2025

ఈసీఐఎల్ క్యాంటీన్ లో పప్పులో పాము పిల్ల

- Advertisement -
- Advertisement -

కుషాయిగూడ: ఈసీఐఎల్ కంపెనీ క్యాంటీన్లోని పప్పులో పాము రావడంతో ఉద్యోగులు ఆందోళనలకు చెందారు. ఈసీఐఎల్ సెంట్రల్ క్యాంటీన్ నుండి వండిన వస్తువులను చర్లపల్లి లోని ఈవీఎం సంస్థకి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం ఈవీఎం క్యాంటీన్లో సిబ్బంది ఆహార పదార్థాలను ఉద్యోగులకు అందించే సమయంలో పప్పులో నుండి పాము పిల్ల బయటపడడంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని బయటికి రాకుండా యజమాన్యం, సిబ్బంది జాగ్రత్త పడడంతో అప్పటికే భోజనాలు చేసి విషయం తెలుసుకున్న కొంతమంది ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో కూడా ఈ క్యాంటీన్ వ్యవహారంలో అనేక అవకతవకలు జరిగినట్లు ఇదే కాకుండా ఎలకలు, బీడీలు, సిగరెట్టు, జిల్ల పురుగులు ఆహార పదార్థాలలో వస్తాయని నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఏదిఏమైనా వెయిలా మందికి భోజనం అందించే ఈసీఐఎల్ క్యాంటీన్ అధికారులు ఉద్యోగులు ఆహార పదార్థాల పట్ల నిర్లక్ష్యం వహించిన వారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కంపెనీ యాజమాన్యంపై కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్లు కేసు నమోదు చేయాలని పూర్తిస్థాయి విచారణ చేయించాలని ఉద్యోగులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News