Sunday, February 23, 2025

బచ్చన్ సాబ్ ఫ్యాన్ ఆంథమ్

- Advertisement -
- Advertisement -

Bachaan Saab Fan Anthem Song Launch by RaviTeja

ఆకాష్ పూరి ‘చోర్ బజార్’ చిత్రంలోని ‘బచ్చన్ సాబ్ ఫ్యాన్ ఆంథమ్’ లిరికల్ సాంగ్‌ను మాస్ స్టార్ రవితేజ విడుదల చేశారు. రవితేజ కూడా అమితాబ్ అభిమానే. తన సినిమాల్లో అమితాబ్ డైలాగ్స్ చెబుతుంటారు. ఇక పూరీ ఫ్యామిలీతో తనకున్న అనుబంధం, అటు తన ఫేవరేట్ స్టార్ పేరు మీద చేసిన పాట కాబట్టి రవితేజ సంతోషంగా ఈ పాటను విడుదల చేశారు. ‘బచ్చన్ సాబ్ ఫ్యాన్ ఆంథమ్’ బాగుందని, ‘చోర్ బజార్’ సినిమా హిట్ కావాలని రవితేజ అన్నారు. ’బచ్చన్ సాబ్ ఫ్యాన్ ఆంథమ్’ పాటను మదీన్ ఎస్కే స్వరకల్పనలో మిట్టపల్లి సురేందర్ సాహిత్యాన్ని అందించగా మంగ్లీ పాడారు. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమాకు జీవన్ రెడ్డి దర్శకత్వం వహించారు. గెహనా సిప్పీ నాయికగా నటించింది. లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘చోర్ బజార్’ ఈనెల 24న విడుదలకు సిద్ధమవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News