Wednesday, July 3, 2024

నరేష్ బర్త్ డే…. ’బచ్చల మల్లి’ మూవీ గ్లింప్స్..

- Advertisement -
- Advertisement -

హీరో అల్లరి నరేష్ ఆదివారం తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా, తన అప్ కమింగ్ మూవీ ’బచ్చల మల్లి’ మేకర్స్ హీరో ఇంటెన్స్ క్యారెక్టర్‌ని పరిచయం చేస్తూ ఒక స్పెషల్ గ్లింప్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి బ్లాక్ బస్టర్లను అందించిన హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా చాలా గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. హీరో ఇంటి దగ్గర లౌడ్‌స్పీకర్‌లో భగవద్గీత ప్లే చేయడంతో గ్లింప్స్ ఓపెన్ అవుతుంది. అది హీరో నిద్ర కు భంగం కలిగిస్తుందని దానిని ఫెరోషియస్‌గా రిమూవ్ చేస్తాడు. తర్వాత లోకల్ బార్‌లో స్టైల్‌గా ఆల్కహాల్ సేవించి, అక్కడ ఉన్న గూండాలతో ఫైట్ చేసిన ఎపిసోడ్ అదిరిపోయింది. ఏయ్ ఎవడి కోసం తగ్గాలి… ఎందుకు తగ్గాలి’ అంటూ అల్లరి నరేష్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ క్యారెక్టర్ మొండి వైఖరిని తెలియజేసింది.

అల్లరి నరేష్ ఇం తకు ముందు ఇలాంటి మాస్ క్యారెక్టర్ చేయలేదు. సుబ్బు అతన్ని మునుపెన్నడూ చూడని అవతార్‌లో చూపించాడు. నరేష్ తన పాత్ర కోసం ట్రాన్స్ ఫర్మేషన్ అయ్యారు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ సాలిడ్‌గా ఉంది. గ్లింప్స్ మాస్‌గా వుంది. ఇది పర్ఫెక్ట్ బర్త్ డే ట్రీట్, అల్లరి నరేష్ తన పవర్ ప్యాక్డ్ నటనతో అదరగొట్టారు. అల్లరి నరేష్ సరసన అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. బచ్చల మల్లి సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

సితార ఎంటర్‌టైన్మెంట్స్‌తో వైవిధ్యమైన చిత్రం

అల్లరి నరేశ్ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ వైవిధ్యమైన చిత్రాన్ని నిర్మించనుంది. ఆదివారం అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా ‘మీరు అతని కంటి నుండి తప్పించుకోలేరు‘ అంటూ విలక్షణమైన కాన్సెప్ట్ పోస్టర్‌తో నిర్మాణ సంస్థ ఈ చిత్ర ప్రకటించింది. సంకేత భాషతో రూపొందించిన ఈ పోస్టర్ ఎంతో సృజనాత్మకంగా ఉంది. ఒక్క పోస్టర్‌తోనే విభిన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రానుందనే విషయాన్ని స్పష్టం చేశారు. ‘ఫ్యామిలీ డ్రామా’ చిత్రంతో ప్రశంసలు పొందిన రచయిత-దర్శకుడు మెహర్ తేజ్ ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News