Monday, January 6, 2025

అల్లరి నరేష్ లేకపొతే ‘బచ్చలమల్లి’ లేదు

- Advertisement -
- Advertisement -

హీరో అల్లరి నరేష్ తన అప్‌కమింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ’బచ్చల మల్లి’లో పూర్తి మాస్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. గురువారం ఈ సినిమా టీజర్‌ను లాంచ్ చేశారు. టీజర్ ప్రధానంగా అల్లరి నరేష్ పాత్రపై ఫోకస్ చేస్తోంది. అల్లరి నరేష్ పాత్రని మొండి, పట్టుదల, మూర్ఖత్వం ఉన్న వ్యక్తిగా టీజర్ హైలెట్ చేస్తోంది. నరేష్ మాస్ లుక్, అతని నటన ఆకట్టుకుంటుంది.

అతని ప్రయాణంలో అమృత అయ్యర్ కీలక పాత్ర పోషిస్తుండగా, రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష తదితరులు ఈ సినిమాలో నటించారు. బచ్చల మల్లి డిసెంబర్ 20న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ “డైరెక్టర్ సుబ్బు మూడేళ్లు ఈ సినిమాతో జర్నీ చేశారు. ఆయన అద్భుతంగా సినిమా తీశారు. ఈ సినిమాలో సాంగ్స్ చాలా స్పెషల్ గా ఉండబోతున్నాయి. విశాల్, డైరెక్టర్ సుబ్బు దాదాపు 6 నెలలు కూర్చుని ఈ సినిమా కోసం పాటల్ని సిద్ధం చేశారు”అని అన్నారు.

డైరెక్టర్ సుబ్బు మంగదేవి మాట్లాడుతూ “అల్లరి నరేష్ లేకపొతే బచ్చలమల్లి అనే క్యారెక్టర్ లేదు. నేను ఎలా చేయమంటే అలా చేశారు. విశాల్ చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు”అని తెలిపారు. నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ “ఈ సినిమా కథ విన్నప్పుడు కళ్ళలో నీళ్ళు వచ్చాయి. చాలా ఇష్టపడి ప్రేమించి చేసిన సినిమా ఇది. హనుమాన్ తర్వాత అమృత ఇయర్ ఈ సినిమా చేస్తున్నారు. నరేష్ కెరీర్‌లో ఇది బెస్ట్ మూవీ అని గర్వంగా చెబుతున్నాను”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ అమృత అయ్యర్, ప్రసాద్ బెహరా, రిచర్డ్, చోటా కె ప్రసాద్, బ్రహ్మ కడలి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News