Monday, December 23, 2024

బిజెపి మీద విరుచుకుపడిన మహువా మోయిత్ర

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ‘క్యాష్ ఫర్ క్యూరి ఆరోపణలు’ కింద 17వ లోక్ సభ నుంచి బహిష్కృతురాలైన టిఎంసి ఎంపీ మహువా మోయిత్ర నేడు లోక్ సభలో బిజెపి పై విరుచుకుపడ్డరు.  ‘నా గళం నొక్కేసినందుకు బిజెపికి మంచి శాస్తే జరిగింది’ అన్నారు.

‘ఇదివరలో నేను మాట్లాడటానికి లేచినప్పుడు నన్ను మాట్లాడనివ్వలేదు. అధికార పార్టీ ఓ ఎంపీ గళాన్ని నొక్కేసింది’ అన్నారు. ‘‘ వారు నా గొంతుకను నొక్కేస్తే, ప్రజలు వారి నోరు మూయించారు. అంటే వారు 63 ఎంపీ సీట్లు కోల్పోయేలా చేశారు. ముఝే బిటానే కె చక్కర్ మే జనతా నే ఆప్కో బిటా దియా, ఆప్కే 63 ఎంపీస్ లాస్ కర్ దియా’’అంటూ చెప్పుకొచ్చారామె.

పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇంకా ఆమె ఎన్నికల సంఘాన్ని కూడా తీవ్రంగా విమర్శించారు. బిజెపి ప్రవర్తనా నియమావళిని ఎన్నికల సంఘం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది’’ అన్నారు.

‘‘ అధికార పార్టీ, ప్రధాని కారణంగా ఎన్నికల సంఘం ప్రవర్తనా నియమావళిని బిజెపి ఉల్లంఘించినా చూసి చూడనట్లు, విని విననట్లు వ్యవహరించింది. ఓటర్లే చివరికి ఛార్జీ తీసుకుని బిజెపికి బుద్ధి చెప్పారు’’అన్నారామె.

ప్రభుత్వం చేపట్టిన మౌలిక వసతులను గురించి విమర్శిస్తూ ‘‘ మీరు వందే భారత్ బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టుకు రూ. 1.08 లక్షల కోట్లు కేటాయించారు. ‘కవచ్’ లేనందు వల్ల గత వారం మూడు రైళ్లు ఢీకొన్నాయి. ఇప్పుడు ఫండింగ్ చేసినా వాటిని అన్ని రైళ్లకు ఏర్పాటు చేయడానికి 50 ఏళ్లు పడతాయి’’ అని మహువా మోయిత్రా కడిగి పారేశారు.

‘‘ఇక మన వైమానిక రంగం విపత్తుల నిలయంగా మారింది. కొత్తగా నిర్మించిన విమానాశ్రయాలు వాన నీళ్లతో నిండిపోతున్నాయి. మన మౌలిక వసతుల ప్లానింగ్ ఇలా ఏడుస్తుంది’’ అని దుయ్యబట్టారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News