Monday, January 20, 2025

దానం, కడియం, తెల్లంకు హైకోర్టులో ఎదురుదెబ్బ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మరోసారి షాక్ తగిలింది. బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్ళిన ఎంఎల్‌ఎలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల అనర్హతపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు డివిజన్ బెంచ్ నిరాక రించింది. సింగిల్ బెంచ్ తీర్పును అసెంబ్లీ కార్యదర్శి సవాల్ చేయగా తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్ట్ డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. ఈనెల 24న వాదనలు వింటామని స్పష్టం చేసింది. ఎంఎల్‌ఎల అనర్హతపై 20 రోజుల క్రితం సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన సంగతి విది తమే. షెడ్యూల్ ఖరారు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. దానం, కడియం, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని హైకోర్టును గతంలో బిఆర్‌ఎస్ ఆశ్రయించింది.

పార్టీ ఫిరాయించిన ఆ ఎంఎల్‌ఎలపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయ కార్య దర్శిని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. తాము చెప్పినట్లుగా నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా కేసు స్వీకరించి మళ్లీ విచారణ ప్రారంభిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు తీర్పుతో బిఆర్‌ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎంఎల్‌ఎలలో టెన్షన్ పెరిగిపోయింది. అసెంబ్లీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? హైకోర్టు ఎలా రియాక్ట్ అవుతుందోనని ఉత్కంఠ నెలకొంది. దీంతో మరికొన్ని రోజుల్లో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు ఎంఎల్‌ఎ సభ్యత్వంపై వేటు పడే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆగస్టులో విచారణ- సెప్టెంబర్‌లో తీర్పు
హైకోర్టులో ఏప్రిల్‌లో పిటిషన్ వేసే నాటికి బిఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎంఎల్‌ఎలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు పార్టీ మారారు. వాళ్లపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లు పాడి కౌశిక్‌రెడ్డి, కెసి వివేకా నంద, బిజెపి ఎంఎల్‌ఎ మహేశ్వర్‌రెడ్డి దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఆగస్టు 7న వాదనలు పూర్తి అయ్యాయి. తర్వాత తీర్పును హైకోర్టు సింగిల్ బెంచ్ రిజ్వర్ చేసింది. సెప్టెంబర్ 9న సోమవారంనాడు తీర్పు వెలువరించింది.

అరికెపూడి వర్శెస్ కౌశిక్ రెడ్డి
ఏప్రిల్ తర్వాత మరికొందరు ఎంఎల్‌ఎలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలా వెళ్లి వచ్చిన ఎంఎల్‌ఎ అరికెపూడి గాంధీని పిఎసి ఛైర్మన్‌గా కూడా చేయడం ఈ మధ్య కాలంలో పెను వివాదానికి కారణమైంది. ఆ టైంలో కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య తీవ్ర వార్ నడిచింది. తాను ఇంకా బిఆర్‌ఎస్‌లోనే ఉన్నానంటూ అరికెపూడి వాదిస్తుంటే, లేదు పార్టీ మారుతున్నట్టు కండువా కూడా మార్చుకున్నారని బిఆర్‌ఎస్ ఆరోపిస్తూ వస్తోంది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News