Tuesday, April 1, 2025

బిసి గురుకులాల్లో బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి… ఆన్‌లైన్ దరఖాస్తు గడువు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : బిసి గురుకుల పాఠశాలలో 6, 7, 8, 9 తరగతుల్లో బ్యాక్ లాగ్ సీట్ల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించేందుకు గడువును ఈ నెల 31 నుండి ఏప్రిల్ 6 వరకు పొడిగించినట్లు – బిసి గురుకుల విద్యాలయాల సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంజెపి కార్యదర్శి బడుగు సైదులు తెలిపారు. మొత్తం బ్యాక్ లాగ్ సీట్లు 6,832 ఉన్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ 20న ఆదివారం ఉదయం 10 గం.ల నుండి మధ్యాహ్నం 12 గం.ల వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బిసి గురుకుల పాఠశాలలో 202526 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న 6, 7, 8, 9వ తరగతి సీట్లను భర్తీ చేయడానికి నిర్వహించే ప్రవేశ పరీక్షకు అర్హులైన విద్యార్థులు ఏప్రిల్ 6 లోగా www.mjptbcwreis.telangana.gov.in లేదా https://mjptbcadmissions.org వెబ్‌సైట్లలో దరఖాస్తు చేసుకోవాలని బడుగు సైదులు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News