- Advertisement -
- ఓ భర్త భార్యను దిండుతో మొఖం మీద పెట్టి హత్య చేసిన కేసును విచారిస్తున్న పోలీసులు
దుబ్బాక(మిరుదొడ్డి): సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో ఓ భర్త భార్యను దిండుతో మొఖం మీద పెట్టి హత్య చేసిన సంఘటన కలకలం రేపింది. మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన పూస కనకరాజుకు చల్మెడ గ్రామానికి చె ందిన భవానితో సంవత్సరం క్రితం వివాహం జరిగింది. వివాహం జరిగిన కొద్ది రోజులకే భార్యాభర్తల మధ్య గొడవలు కావడంతో పెద్ద మనుషుల సమక్షంలో సర్ది చెప్పారు. అయితే మంగళవారం ఉదయం భవానిని దిండుతో మొఖం మీద పెట్టి భర్త హత్య చేసినట్లు మిరుదొడ్డి ఎస్‌ఐ శ్రీధర్ గౌడ్ తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య కేసును విచారిస్తున్నారు. కనకరాజు పరారీలో ఉన్నట్లు సమాచారం ఉంది. కుటుంబ కలహాల, వరకట్నం వేధింపుల అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
- Advertisement -