- Advertisement -
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్ చెప్పింది. ఉద్యోగుల జీతాల పెంపు కోసం 8వ వేతన సవరణ సంఘాన్ని ఇప్పట్లో ఏర్పాటు చేసే ఆలోచన లేదని కేంద్రం ప్రకటించింది. 7వ వేతన సవరణ సంఘం సిఫార్సులే ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతో కొత్త సంఘం ఏర్పాటు చేయడం లేదని పేర్కొంది. ఉద్యోగుల జీతాల పెంపునకు ప్రతి 6 నెలలకు ఒకసారి డీఏ సవరిస్తున్నట్లు తెలిపింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు ఇప్పట్లో పెరిగే ఛాన్స్ లేనట్లే. ప్రస్తుత 7వ పే కమిషన్ 2014లో ఏర్పాటైందని కేంద్రం ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది.
- Advertisement -