Monday, December 23, 2024

వారు పెద్దోళ్లు: ప్రశాంత్ కిశోర్

- Advertisement -
- Advertisement -

మోతిహారి: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’పై  రాజకీయవేత్తగా మారిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ శనివారం వ్యంగ్యంతో కూడిన ప్రశంసలు గుప్పించారు. ప్రస్తుతం కిశోర్ కూడా తన స్వంత రాష్ట్రమైన బీహార్‌లో పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనని ఓ పాత్రికేయుడు ‘రాహుల్ గాంధీ పాదయాత్రకు, మీ పాదయాత్రకు మధ్య సాపత్యం ఉందా?’ అని ప్రశ్నించాడు. దానికి ప్రశాంత్ కిశోర్ ‘వారు చాలా పెద్ద మనుషులు. వారితో పోల్చినప్పుడు నేను లెక్కలోనికి రాను’ అన్నారు. ప్రశాంత్ కిశోర్ ప్రస్తుతం బీహార్‌లో ‘జన్ సురాజ్’ అనే ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన కాంగ్రెస్ అధిష్ఠాన నాయకులతో చర్చలు జరపడంలో విఫలమయ్యారు. ఆయన కాంగ్రెస్‌లో చేరాలనుకున్నారు. పైగా తన నైపుణ్యాలను ఆ పార్టీకి వినయోగించాలనుకున్నారు.

‘రాహుల్ గాంధీ 3500 కిమీ. లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు. నాకు కిలో మీటర్లు పెద్ద విషయం కాదు. ఎందుకంటే నేను అక్టోబర్ నుంచి నాన్-స్టాప్‌గా నడుస్తున్నాను. కానీ నేను నా శారీరక ఫిట్‌నెస్‌ను చూపాలనుకోవడంలేదు’ అని కిశోర్ మర్మగర్భంగా వ్యాఖ్యానించారు. బీహార్ రాజకీయాల్లో ఆయన ఓ ‘అవకాశవాది’ అంటున్నారన్నదానికి ఆయన సమాధానం ఇస్తూ, ‘నేను స్వచ్ఛమైన ఉద్దేశ్యంతోనే రాజకీయాల్లోకి వచ్చాను’ అన్నారు. ‘రాజీవ్ గాంధీ అయిన మధ్యమధ్యలో బ్రేక్‌లు తీసుకుంటారేమో కానీ నేను అలా కాదు…నూతన సంవత్సరంలో కూడా నేను బ్రేక్స్ తీసుకోలేదు. మధ్యలో నా ఇంటికి కూడా వెళ్లలేదు’ అన్నారు.

ప్రశాంత్ కిశోర్ మొదటిసారి 2014 లోక్‌సభ ఎన్నికల్లో మోడీ తరఫున విజయవంతంగా ప్రచారం చేయడంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోసం కూడా ఆయన పనిచేసి విజయం సాధించారు. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ(ఐపిఎసి) వ్యవస్థాపకుడు అయిన ప్రశాంత్ కిశోర్ ఆ తర్వాత నితీశ్ కుమార్, ఉద్ధవ్ థాక్రే, ఎంకె.స్టాలిన్, అరవింద్ కేజ్రీవాల్, అమరీందర్ సింగ్, జగన్ మోహన్ రెడ్డి, కె. చంద్రశేఖర్ రావు వంటి వివిధ నేతలతో కూడా మంతనాలు నెరిపారు. కానీ అవేవి ఫలించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News