Wednesday, January 22, 2025

బడిబాట కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహించాలి

- Advertisement -
- Advertisement -
  • మిట్టకోడూర్‌లో ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి, డిఈఓ రేణుకాదేవి

పరిగి: బడిబాటలో భాగంగా డ్రాపౌట్ పిల్లలను పాఠశాలలో చేర్పించి ప్రతిఒక్కరికి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, వికారాబాద్ జిల్లా విద్యాధికారి రేణుకాదేవిలు అన్నారు. మండల పరిధిలోని మిట్టకోడూర్ గ్రామ పంచాయతీ లో సోమవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ బడిబాట కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహించాలని ఆదేశించిందని చెప్పారు. ఈ నెల 20వ తేదిన పరిగిలో విద్యాశాఖపై పెద్ద ఎత్తున నియోజకవర్గం స్థాయిలో సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు.

అనంతరం బడిబాటలో నూతన విద్యార్థులను పాఠశాలలో చేర్పించారు. పిల్లలకు పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కరణం అరవింద్‌రావు, ఏఎంసీ చైర్మ న్ సురేందర్, ఏఎంఓ రవికుమార్, సర్పంచ్ పటేల్ జయలక్ష్మీజగదీశ్వర్, ఎంఈఓ హారిశ్చందర్, సీనియర్ నాయకుడు ప్రవీణ్‌రెడ్డి, చైర్మన్ నర్సిములు, మాజీ ఎంపిటిసి మాణిఖ్యం, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు గోపాల్, లక్నాపూర్ శ్రీనివా స్, పంచాయతీ కార్యదర్శి బిచ్చన్న, గ్రామస్థులు బాబయ్య, బాబు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News