హైదరాబాద్: నగరాల్లో ట్రాఫిక్ రద్ధీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్లైఓవర్స్ ను నిర్మిస్తారు ఇది మనకు తెలిసిన విషయమే. దీంతో వాహనదారులకు కొంత ఊరట లభిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఆడుకునేందుకు కూడా ఉపయోగపడుతోంది. అదెలా అంటారా.. నవీ ముంబయి మున్సిపల్ అధికారులు వినూత్నంగా ఆలోచించి ప్లైఓవర్ కింద ఖాళీ స్థలంలో బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్ కోర్టు ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటుపై నగర యువత హర్షం వ్యక్తం చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఈ వీడియోను చూసిన మంత్రి కెటిఆర్ ఆలోచన బాగుందంటూ కితాబిచ్చారు. ఆ వీడియోను షేర్ చేస్తూ.. హైదరాబాద్ లోని అనుకూలంగా ఉండే కొన్ని ప్లైఓవర్స్ కింద ఇటువంటి ఆట స్థలాలను ఏర్పాటు చేద్దామంటూ పురపాలకశాక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ను ట్యాగ్ చేశారు.
This is brilliant idea 💡
I think all cities should implement this 👌🏼Does your city have something similar? pic.twitter.com/qe5px87ecP
— Dhananjay_Tech (@Dhananjay_Tech) March 27, 2023