- Advertisement -
ముంబై: భారత బ్యాడ్మింటన్ దిగ్గజం నందు నటేకర్ (88) బుధవారం మృతి చెందారు. వృద్ధాప్య కారణాలతో ఆయన తుది శ్వాస విడిచారు. మూడు నెలలుగా నటేకర్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇక భారత బ్యాడ్మింటన్ తొలి తరం దిగ్గజంగా నటేకర్ పేరు తెచ్చుకున్నారు. 1956లో అంతర్జాతీయ టైటిల్ సాధించిన ఆ ఘనత సాధించిన తొలి భారత షట్లర్‌గా నిలిచారు. సుదీర్ఘ కెరీర్‌లో నటేకర్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వందకు పైగా టైటిల్స్‌ను సాధించారు. నటేకర్‌కు అర్జున అవార్డుతో ప్రభుత్వం సత్కరించింది. భారత బ్యాడ్మింటన్ స్టార్ ఆటగాళ్లలో నటేకర్ ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన మృతిపై కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
- Advertisement -