Thursday, January 23, 2025

నగరంలో షట్లర్ల సందడి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇటీవల ముగిసిన ఆసియా క్రీడల్లో పతకాల పంట పండించిన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు బుధవారం హైదరాబాద్ చేరుకున్నారు. పురుషుల డబుల్స్‌లో స్వర్ణం సాధించిన సాత్విక్ సాయిరాజ్‌తో పాటు స్టార్ ఆటగాళ్లు హెచ్.ఎస్.ప్రణయ్, రోహన్ కపూర్, భారత బ్యాడ్మింటన్ ప్రధాన కోచ్ పుల్లెల గోపీచంద్ తదితరులు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.

వీరికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా షట్లర్లు సాత్విక్, ప్రణయ్, రోహన్ తదితరులు డాన్స్‌లతో అదరగొట్టారు. విమానాశ్రయం నుంచి ఊరెగింపుగా గచ్చిబౌలిలోని గోపీచంద్ అకాడమీకి చేరుకున్నారు. ఇక సాత్విక్ డాన్స్‌కు సంబంధించి వీడియోలు వైరల్‌గా మారాయి. అనంతరం వీరికి గోపీచంద్ అకాడమీలో ఘన సత్కారం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News