- Advertisement -
గోపేశ్వర్: శీతాకాల విరామం అనంతరం ప్రసిద్ధ బద్రీనాథ్ ఆలయం మంగళవారం తెల్లవారుజామున సంప్రదాయ రీతిలో పునఃప్రారంభమైంది. ఉత్తరాఖండ్‌లోని హిమాలయ పర్వత ప్రాంతంలో వెలసిన బద్రీనాథ్ ఆలయ ద్వారాలను ప్రధాన అర్చకులు ఈశ్వర్ ప్రసాద్ నంబూద్రి తెల్లవారుజామున 4.15 గంటలకు వేద మంత్రోచ్ఛరణల నడుమ తెరిచారు. కాగా, కొవిడ్ నిబంధనలను అనుసరించి ఈ కార్యక్రమంలో స్వల్ప సంఖ్యలో అర్చకులు, ధర్మాధికారి, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. సాధారణ పరిస్థితులలో ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. వరుసగా రెండవ సంవత్సరం ఈ కార్యక్రమం అతి కొద్ది మంది వ్యక్తుల సమక్షంలో జరిగింది. కరోనా వైరస్ విజృంభణ కారణంగా ప్రస్తుతం భక్తులను ఆలయ సందర్శనకు అనుమతించడం లేదు.
- Advertisement -