Saturday, January 11, 2025

అదనపు కలెక్టర్‌లుగా బాధ్యతలు స్వీకరించిన బడుగు చంద్రశేఖర్, మాధురి

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా బి. చంద్రశేఖర్, అదనపు కలెక్టర్ (రెవిన్యూ)గా ఆర్‌డి మాధురి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అదనపు కలెక్టర్లు ఇద్దరూ జిల్లా కలెక్టరేట్‌లోని తమ తమ చాంబర్లలో పదవి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా డిఆర్‌ఓ నగేష్, రెవెన్యూ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు అదనపు కలెక్టర్లకు స్వాగతం పలికి, పరిచయం చేసుకున్నారు. శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్(రెవిన్యూ) గా కొనసాగిన బి. చంద్రశేఖర్‌ను సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా నియమిస్తూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ)గా కొనసాగిన జి. వీరారెడ్డిని సిసిఎల్‌ఏ కార్యాలయానికి బదిలీ చేస్తూ, ఆయన స్థానంలో జగిత్యాల ఆర్డిఓగా పనిచేస్తున్న ఆర్‌డి మాధురిని జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ)గా ప్రభుత్వం నియమించింది. అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News