Thursday, January 23, 2025

అన్నం పెట్టే రైతుపై బిజెపి కక్ష కట్టింది: బడుగుల లింగయ్య

- Advertisement -
- Advertisement -

Badugula lingaiah yadav comments on Modi govt

హైదరాబాద్: ఎనిమిది ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రంగాల్లో విఫలమయ్యారని రాజ్యసభ ఎంపి బడుగుల లింగయ్య యాదవ్ మండిపడ్డారు. దేశానికి అన్నం పెట్టే రైతుపై బిజెపి కక్ష కట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ సర్కార్ మోటర్లకు మీటర్లు పెట్టే కుట్ర చేస్తోందని దుయ్యబట్టారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదగిందని ప్రశంసించారు. కుల, మతాల మధ్య చిచ్చు పెడుతూ బిజెపి పబ్బం గడుపుతోందన్నారు. పార్లమెంటు సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును మోడీ అవమానపరిచారని, విభజన హామీలను మోడీ సర్కారు నెరవేర్చలేదని, కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని బిజెపోళ్లను ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కోతల్లేని కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు అవసరం ఉందని బడుగుల లింగయ్య యాదవ్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News