అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ సామగ్రితో ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలకు శుక్రవారం సాయంత్రానికే చేరుకున్నారు. బద్వేలు నియోజకవర్గంలో మొత్తం 281 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిలో 221 కేంద్రాలను సమస్యాత్మకం అని భావించిన ఎన్నికల సంఘం ఒక్కొక్క కేంద్రంలో ఒక్కొక్క మైక్రో అబ్జర్వర్‌ను నియమించింది. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని వెబ్ కాస్టింగ్ సర్వర్‌తో అనుసంధానించారు. బద్వేల్ ఉప ఎన్నిక నేపథ్యంలో కడప జిల్లా సరిహద్దుల్లో 23 చెక్‌పోస్టులు, నియోజకవర్గ సరిహద్దుల్లో 14 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఒక్కో చెక్‌పోస్టులో పది మందిని నియమించామని జిల్లా ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. ప్రస్తుతం బద్వేలు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 2,15,292 ఓట్లు ఉన్నాయి. అందులో పురుషులు 1,07,915 మంది, మహిళలు 1,07,355 మంది ఉన్నారు. ట్రాన్స్‌జెండర్లు 22 మంది ఉన్నట్లు ఇసి అధికారులు పేర్కొన్నారు.
బద్వేల్ ఉప ఎన్నికకు సర్వసిద్థం
- Advertisement -
- Advertisement -
- Advertisement -