బీఏఎఫ్టిఏ (“ది బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్) ఈరోజు ప్రఖ్యాత చిత్రనిర్మాత గునీత్ మోంగా కపూర్‌ని 2023కి గాను కొత్తగా నియమించబడిన బ్రేక్‌త్రూ ఇండియా అంబాసిడర్ గా ప్రకటించింది. ఇప్పుడు మూడవ ఎడిషన్ లో, బాఫ్టా బ్రేక్‌త్రూ ప్రోగ్రామ్ కు నెట్ ఫ్లిక్స్ అండగా నిలిచింది. ఈ కార్యక్రమం భారతీయ చలనచిత్రం, గేమ్స్, టెలివిజన్ పరిశ్రమలలో తదుపరి తరం ప్రతిభను గుర్తించడం, మద్దతు ఇవ్వడం, పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
గునీత్ మోంగా కపూర్ నిష్ణాతురాలైన భారతీయ చలనచిత్ర నిర్మాత, బాఫ్టా నామినీ. సినిమా ప్రపం చానికి అందించిన విశేషమైన సహకారానికి గాను ఆమె బ్రేక్‌త్రూ ఇండియా ప్రచారకర్తగా ఎంపిక అయ్యారు. చలనచిత్రంలో ఫలవంతమైన కెరీర్‌తో, ముంబైకి చెందిన నిర్మాణ సంస్థ సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్ వ్యవస్థాపకురా లిగా, గునీత్ తన అత్యుత్తమ కృషికి అంతర్జాతీయ గుర్తింపు పొందారు. ఆమె చెవాలియర్ డాన్స్ ఎల్’ఆర్డ్రే డెస్ ఆర్ట్స్ ఎట్ డెస్ లెటర్స్ గ్రహీత కూడా. ఆల్ఫ్రెడ్ పి. స్లోన్ ఫౌండేషన్, అమెరికా డిపార్ట్ మెంట్ ఆఫ్ స్టేట్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ అఫైర్స్ వంటి గౌరవప్రదమైన సంస్థలచే గుర్తింపు పొందింది.
గునీత్ భారతదేశంలోని బాఫ్టా బ్రేక్‌త్రూ ప్రోగ్రామ్‌తో సన్నిహితంగా పాల్గొన్నారు. 2022లో పరిశ్రమ మద్దతు దారుగా, జ్యూరీ మెంబర్‌గా సేవలందించారు. దేశంలో గొప్ప, విభిన్న ప్రతిభావంతులను గుర్తించడంలో, ప్రోగ్రా మ్ గురించి అవగాహన పెంచడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఈ నియామకం వర్ధమాన సృజనాత్మకత లను మరింత శక్తివంతం చేస్తుంది, వారికి ప్రపంచ వేదికపై రాణించడానికి అసమానమైన అవకాశాలను అంది స్తుంది.
చిత్ర నిర్మాత, సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్ వ్యవస్థాపకురాలు, సీఈఓ గునీత్ మోంగా కపూర్ ఇలా అన్నారు: “భా రతదేశంలోని సృజనాత్మక పరిశ్రమలలో అభివృద్ధి చెందుతున్న ప్రతిభావంతుల ప్రొఫైల్‌ను పెంచడంలో సహా యపడటానికి ఏఆర్ రెహమాన్ అడుగుజాడల్లో ఈ ప్రచారకర్త పాత్రను చేపట్టడం గౌరవంగా భావిస్తున్నాను. 2022లో బాఫ్టా బ్రేక్‌త్రూ కోసం పరిశ్రమ మద్దతుదారుగా, జ్యూరీ సభ్యురాలిగా పనిచేశాను. ఈ పథకం కొంత మంది అత్యుత్తమ స్వతంత్ర భారతీయ ప్రతిభావంతులకు ప్రయోజనం చేకూర్చిందని నేను నమ్మకంగా చెప్ప గలను. బాఫ్టా, నెట్ ఫ్లిక్స్ వంటి ప్రత్యేకమైన ప్లాట్‌ఫామ్ సంస్థలతో కెరీర్‌లు వేగవంతం కావడాన్ని నేను చూశా ను. ఈ సంవత్సరం స్వదేశీ ప్రతిభావంతుల దరఖాస్తులు అత్యధికంగా రావడాన్ని చూస్తున్నాను” అని అన్నా రు.
బాఫ్టా లెర్నింగ్, ఇన్‌క్లూజన్, పాలసీ, మెంబర్‌షిప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టిమ్ హంటర్ ఇలా అన్నారు..“ఈ సంవత్సరం బ్రేక్‌త్రూ ఇండియా ప్రచారకర్తగా గునీత్‌ను స్వాగతిస్తున్నందుకు మేం సంతోషిస్తున్నాం. ఈ కా ర్యక్రమం కొత్త భారతీయ సృజనాత్మకతలను గుర్తించడం, పెంపొందించడం కోసం ప్రత్యేకించబడింది. నిష్ణాత ని ర్మాత, చిత్రనిర్మాతగా ఆమె అసాధారణమైన ప్రతిభ, గొప్ప పరిశ్రమ నైపుణ్యం నుండి ఈ కార్యక్రమం కచ్చితంగా ప్రయోజనం పొందుతుంది. బాఫ్టా సృజనాత్మకత, వాస్తవికతను చాంపియన్‌గా ఉంచే విభిన్న, సమగ్ర పరి శ్రమను పెంపొందించడానికి, సృష్టించడానికి కట్టుబడి ఉంది. దరఖాస్తు గడువును రెండు వారాల పాటు పొడి గించడానికి, ఆసక్తి ఉన్నవారిని మరింతగా కలుసుకోవడానికి, దరఖాస్తు చేసుకోవడానికి ప్రోత్సహించడానికి సంతోషిస్తున్నాం!”
నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ ఇలా అన్నారు: “బ్రేక్‌త్రూ ప్రోగ్రామ్ రాబోయే భారతీయ సృజనాత్మక కమ్యూనిటీ అంతర్జాతీయంగా వెలుగులోకి వచ్చేందుకు వీలు కల్పించడమే కాకుండా అపూర్వమైన స్థాయిలో ఆలోచనల క్రాస్-కల్చరల్ ఎక్స్ ఛేంజ్‌కు చక్కటి వేదికను అందిస్తుంది. ఈ కార్య క్రమానికి మా మద్దతును కొనసాగించడానికి ఎదురుచూస్తున్నాం. పరిశ్రమలో తమ నైపుణ్యాలను మెరుగు పరుచుకోవడంలో ప్రతిభావంతులకు మద్దతు ఇవ్వడానికి, తమ ఉత్తమ కృషిని చాటేందుకు, ప్రపంచ వేదికపై తమను తాము ప్రదర్శించడానికి మేం కట్టుబడి ఉన్నాం.
జనాదరణ పొందిన డిమాండ్ కారణంగా బాఫ్టా బ్రేక్‌త్రూ ఇండియా కార్యక్రమం కోసం గడువును బాఫ్టా రెండు వారాల పాటు పొడిగించింది. ఈ గడువు ఇప్పుడు జూలై 20, 2023న సాయంత్రం 4.30 గంటలకు ముగుస్తుంది. దరఖాస్తు సమర్పించే సమయంలో దరఖాస్తుదారులు తప్పనిసరిగా 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి, కనీసం రెండు సంవత్సరాలు భారతదేశంలోని ప్రాథమిక నివాసితులు, సంభాషణపరంగా ఆంగ్లంలో నిష్ణాతులుగా ఉండాలని అర్హత ప్రమాణాలు పేర్కొంటున్నాయి. చలనచిత్రం, గేమ్స్, టెలివిజన్‌లో క్రాస్-కల్చరల్ చర్చలను ప్రోత్సహించే లక్ష్యంతో, ఈ ప్రోగ్రామ్ యూకే అభ్యాసకులతో సహకరించడానికి, వారి నైపుణ్యాన్ని పంచుకోవడానికి, (లేదా) యూకే ప్రేక్షకుల కోసం కంటెంట్‌ను ఉత్పత్తి చేయడానికి ఇష్టపడే అభ్యర్థుల కోసం వెతుకుతోంది. దరఖాస్తు చేయడంలో మరింత సమాచారం కోసం BAFTA సపోర్టింగ్ టాలెంట్ వెబ్‌పేజీని ఇక్కడ సందర్శించండి