Sunday, January 19, 2025

బాహుబలి-3 రానుందా?

- Advertisement -
- Advertisement -

Bahubali-3
హైదరాబాద్: ‘బాహుబలి’ భారతీయ చిత్రసీమలో ఓ పెద్ద రికార్డునే సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద ఊహించనంత వసూళ్లు కూడా రాబట్టింది. దేశవిదేశాల్లో కూడా మంచి ఆదరణ పొందింది.  ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా, సత్యరాజ్ ఆ సినిమాలో పోటీపడి నటించారు. అయితే బహుబలి-3 రాదంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండగా…ఇటీవల ఓ ఇంటర్వూలో పాల్గొన్న ప్రభాస్…పార్ట్-3 గురించి తనకు తెలియదన్నారు. కాగా తాజాగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న రాజమౌళి దానిపై క్లారిటీ ఇచ్చారు. ‘బాహుబలి-3పై వర్క్ చేస్తున్నాం. తప్పకుండా ఆ పార్ట్ వస్తుందని భావించవచ్చు. నిర్మాత యార్లగడ్డ కూడా సుముఖంగా ఉన్నారు. అయితే కాస్త టైం పట్చొచ్చేమో…కానీ బాహుబలి రాజ్యం నుంచి ఆసక్తికర వార్త రానుంది’ అన్నారు. ఆయన ఈ క్లారిటీ ద్వారా బాహుబలి3పై త్వరలో ఏదో ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News