Sunday, January 19, 2025

బహుబలి మంచినీటి ట్యాంక్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పురస్కరించుకుని గురువారం పట్టణ ప్రగతి దినోత్సవం సందర్భంగా ఖమ్మం నగరంలో త్రాగునీటి శాశ్వత పరిష్కారం లో భాగంగా ఐదు డివిజన్లలో రూ.10.23 కోట్లతో నూతనంగా నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్‌లను మంత్రి పువ్వాడ ప్రారంభించారు.ఖమ్మం కార్పోరేషన్ పరిధిలోని 20వ డివిజన్ రామ చంద్రయ్య నగర్‌లో రూ.1.80 కోట్లతో నిర్మించిన 10 లక్షల లీటర్ల సామర్థ్యం గల ట్యాంక్, 23వ డివిజన్ ఎస్ పి ఆఫీస్ రోడ్ లో రూ.1.65 కోట్లతో నిర్మించిన 9లక్షల సామర్థ్యం గల ట్యాంక్, 32వ డివిజన్ గుట్టల బజార్ లో రూ.3.48 కోట్లతో నిర్మించిన 23 లక్షల లీటర్ల సామర్థ్యం గల(బహుబలి) ట్యాంక్, 53వ డివిజన్ ఎన్ ఎస్ పి క్యాంపులోని రూ.1.80 కోట్లతో నిర్మించిన 10లక్షల లీటర్ల సామర్థ్యం గల ట్యాంక్, 43వ డివిజన్ జెడ్ పి సెంటర్ లో రూ.1.50కోట్లతో నిర్మించిన 8లక్షల లీటర్ల సామర్థ్యం గల ట్యాంక్ లను మంత్రి పువ్వాడ ప్రారంభించారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పట్టణ ప్రగతి దినోత్సవం సందర్భంగా ఖమ్మం మున్సిపాల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్యాతిథిగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఎస్‌ఆర్ అండ్ బిజిఎన్‌ఆర్ కాలేజ్ గ్రౌండ్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు కోనసాగిన ఈ ర్యాలీలో మంత్రి తోపాటు కలెక్టర్ గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్, మున్సిపల్ కమీషనర్ ఆదర్శ్ సురబీలు స్వయంగా పాల్గొన్నారు. మున్సిపాలిటీ వాహనాలతో పెద్ద ఎత్తున సఫాయి కార్మికులు బతుకమ్మలతో కోలాట నృత్యలు చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.

  • ‘సఫాయి అన్న సలాం’ విగ్రహావిష్కరణ

ర్యాలీ అనంతరం మునిసిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన “ సఫాయి అన్న సలాం అన్న.. సఫాయి అమ్మ సలాం అమ్మ..” అనే నినాదాలతో ఉన్న విగ్రహాలను మంత్రి ఆవిష్కరించారు. ఆ తరువాత క్రొత్త పారిశుద్ధ్య వాహనాలు, ఫాగింగ్ యంత్రాలను మంత్రి ప్రారంభించారు. కార్యాలయంలో ఏర్పాటుచేసిన స్టేట్ ఛాంబర్, గెస్ట్ రూంలు, రిక్రియేషన్ రూంలను ప్రారంభించారు. ముందుగా కార్యాలయంపై జాతీయ పతాకావిష్కరణ గావించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేసి, పిపిఈ కిట్లు పంపిణీ చేశారు. విశిష్ట సేవలు అందించిన మునిసిపల్ ఉద్యోగులకు అధికారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. మునిసిపల్ కార్పొరేషన్ పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా సఫాయి కార్మికులతో మంత్రి, కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, నగర మేయర్ సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తోపాటు జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, శిక్షణా సహాయ కలెక్టర్లు రాధిక గుప్తా, మయాంక్ సింగ్, కార్పొరేటర్లు, సుడా డైరెక్టర్లు, మునిసిపల్ అసిస్టెంట్ కమీషనర్ మల్లీశ్వరి, పబ్లిక్ హెల్త్ ఇఇ రంజిత్, డిఇ రంగారావు, కార్పోరేటర్లు పగడాల శ్రీవిధ్య, కమర్తపు మురళీ, బిజెక్లైమెంట్ ,బిక్కసాని ప్రశాంత లక్ష్మి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News