Wednesday, January 22, 2025

బాహుబలి సమోసా..తిన్నవారికి బహుమతి ఎంతంటే…

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: బాహుబలి సమోసా గురించి విన్నారా.. ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన ఒక స్వీట్ షాపులో 12 కిలోల బాహుబలి సమోసా తయారైంది. అయితే పుట్టిన రోజున కోసుకు తినడానికి మాత్రం కాదు..దీన్ని 30 నిమిషాలలో ఎవరైనా తినగలిగితే ఆ వ్యక్తికి రూ. 71,000 నగదు బహుమతిని ఇస్తానంటూ ఆ స్వీట్ షాపు యజమాని ప్రకటించాడు.

మీరట్‌లోని లాల్‌కురి ప్రాంతంలో కౌశల్ స్వీట్స్ షాపు ఉంది. చాలా పురాతనమైన ఈ స్వీట్స్ షాపు ఇప్పుడు మూడవ తరానికి చెందిన శుభం కౌశల్ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో స్వీటు పాపులర్. అయితే సమోసాకు రావలసినంత పేరు రాలేదని తెగ బాధపడిపోయిన శుభం కౌశల్ సమోసాకు కూడా ప్రాచుర్యం కల్పించాలని భావించాడు. అంతే&భారీ సైజులో సమోసా తయారుచేయాలని నిర్ణయించుకున్నాడు.

12 కిలోల సైజులో అత్యంత భారీగా తయారైన ఈ సమోసాలో ఆలు, బఠానీలు, పనీర్, డ్రైఫ్రూట్స్, మసాలాలు నింపారు. దీన్ని తయారుచేయడానికి ముగ్గురు వంటవాళ్లకు దాదాపు ఆరుగలంటల సమయం పట్టిందట. బాణలిలో దీన్ని వేయించడానికి గంటన్నరకు పైగా పట్టిందని శుభం చెప్పాడు. దీన్ని పుట్టినరోజుకు కూడా ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చని అతను ఆఫర్ ఇస్తున్నాడు.

ఈ బాహుబలి సమోసాను అరగంటలో తిన్నవారికి రూ. 71,000 బహుమానం ఇస్తానని కూడా శుభం ప్రకటించాడు. అయితే ఆ సమోసా సైజు చూసి ఎవరూ ఆ సాహసం చేయలేకపోతున్నారు. మొత్తానికి ఈ బాహుబలి సమోసా సోషల్ మీడియాలో వైరల్ అయి మంచి పేరే సంపాదించుకుంది. దీంతో తనకు బాహుబలి సమోసాలు కావాలంటూ 40 నుంచి 50 ఆర్డర్లు వచ్చాయని, అద్వాన్సు తీసుకోకుండా మాత్రం దీన్ని తయారుచేయబోనని శుభం కండీషన్ పెడుతున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News