Monday, November 18, 2024

రాజ్యాధికారంతోనే బహుజనుల సమస్యలకు పరిష్కారం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: బహుజనులు ఐక్యంగా ఉంటేనే వారి సమస్యలు తీరుతాయని, జనాభా దామాషా ప్రకారం ఆర్థిక, రాజకీయ, ఉద్యోగ రంగాల్లో వాటా రావాలంటే రాజ్యాధికారం కోసం పోరాడాలని పాపన్న జాతర సమితి చైర్మన్ పి. శ్రీరామ్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం బిసి సెంటర్‌లో బహుజన సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజనుల సమస్యలు తీర్చకుండా తాత్కాలిక తాయిలాలతో బిసిలను ప్రభుత్వాలు మభ్యపెడుతున్నాయని మండిపడ్డారు. అన్ని సమస్యలకు పరిష్కారం బహుజనులకు రాజ్యాధికారమే మార్గమని వక్తలు పిలుపునిచ్చారు. బహుజన సమ్మేళనానికి ముఖ్య అతథులుగా మాజీ ఎంపి రాపోలు ఆనంద భాస్కర్, పాశం యాదగిరి, హైకోర్ట్ అడ్వకేట్ గుండ్రాతి శారద గౌడ్, ఉద్యమకారుల ఫోరం చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్, జై స్వరాజ్ పార్టీ అధ్యక్షులు కాసాని శ్రీనివాస రావు, టిజెఎసి చైర్మన్ కోల జనార్దన్, దూసరి గణేష్, ఓయూ స్కాలర్ భావాండ్ల భాస్కర్ తదితరులు ఈ సమ్మేళనానికి హాజరయ్యారు.

Bahujana Sammelanam held at BC Center in Hyd

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News